Palamaner Convict Escaped From Petrol Bunk: చిత్తూరు జిల్లా పలమనేరులో ఖైదీ పరారీ అయ్యాడు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఖైదీ సూరి అందరి కళ్లుగప్పి పారిపోయాడు. కడప సెంట్రల్ జైలులో హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. సత్ప్రవర్తన కారణంగా జైళ్ల శాఖ అధికారులు పలమనేరులో ప్రారంభించిన పెట్రోల్ బంక్‌లో విధులు కేటాయించారు. సోమవారం రోజు పెట్రోల్ బంక్ నుంచి సూరి పరారయ్యాడు.. అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.