చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. పుంగనూరుకు చెందిన ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. 11 బృందాలతో గాలించారు. డాగ్ స్వ్కాడ్ సైతం రంగంలోకి దింపారు. అయితే ఎక్కడా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌లో ఆరేళ్ల బాలిక మృతదేహం కనిపించడంతో ఆ కుటుంబం గుండె పగిలేలా రోదిస్తోంది.