అనంతపురం రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుష దాడి నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి సస్పెన్షన్‌కి గురైన వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై హెచ్ఎం రాజేశ్వరి కుమారుడు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తన తల్లి సస్పెన్షన్ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. ఈ ఘటనలో ఏ టీచర్ ప్రమేయం గానీ, వైఫల్యం గానీ లేదని, దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఆపండంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు.