కానిస్టేబుల్‌ చేతివాటం.. సీజ్‌ చేసిన ఫోన్‌ నుంచి నగదు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు

3 hours ago 1
హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్‌ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం, నగదును దుర్వినియోగం చేశాడు. వరకట్నం కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారు రూ.12 లక్షలు పొందినట్లు పోలీసులు గుర్తించారు. అదే కేసులో సీజ్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌ నుంచి రూ.1.70 లక్షలను తన ఖాతాతో పాటు బంధువుల ఖాతాలకు బదిలీ చేసినట్లు వెల్లడైంది. బాధితుల ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ నెల 27న కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
Read Entire Article