Cyclone Arnab Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మారింది.. అర్నబ్‌గా నామకరణం చేశారు. ఈ నెల 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని.. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు.