సోలో హీరోగా ఎన్టీఆర్ సినిమా చేసి ఆరేళ్లు దాటింది. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేవర మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. శుక్రవారం మిడ్‌నైట్ షోస్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రభంజనం మొదలైంది.