ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ను కలిసిన దివీస్ ల్యాబొరేటరీస్ సీఈవో కిరణ్.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళం అందించారు. చెక్కును నారా లోకేష్ చేతికి అందించారు. ఇప్పటికే వరద బాధితుల ఆహారం కోసం రూ.4.8 కోట్లను దివీస్ సాయంగా అందించింది. దీంతో మొత్తం రూ.9.8 కోట్లను విరాళంగా అందించినట్లు నారా లోకేష్ తెలిపారు. వారిని అభినందించారు.