Driving Licence Mobile Number Linking: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే సెప్టెంబర్ 25 తర్వాత లైసెన్స్ రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని రవాణా శాఖ సూచిస్తున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లైసెన్స్‌లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు. సారథి పారివాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చునని చెప్పారు. వివరాలు కనిపించకపోతే ఆర్టీవోను సంప్రదించాలన్నారు. తప్పుడు లింకులను నమ్మకుండా అధికారిక పోర్టల్‌నే ఉపయోగించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.