EV Charging Stations: హైదరాబాద్‌లో ఈవీ వాహనదారులకు తీపి కబురు చెబుతూ.. TGREDCO 200 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. తొలుత 10 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఆపరేటర్లు యూనిట్‌కు ప్రస్తుతం రూ.13గా ఉన్న TGREDCO టారిఫ్ ప్రకారమే రుసుము వసూలు చేయాలి. ప్రతి స్టేషన్ 95 శాతం అప్‌టైమ్ కలిగి ఉండటం తప్పనిసరి. TGEV యాప్, 24 గంటల కస్టమర్ సపోర్ట్, భద్రతా సదుపాయాలతో ఛార్జింగ్ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.