విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెదగంట్యాడకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి రైలు కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. ప్లాట్‌ఫామ్ మీద ఉన్న వెంకటరెడ్డి.. రైలు వస్తున్న విషయాన్ని గమనించి.. ఒక్కసారిగా పట్టాలపైకి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.