ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 45 వేల పైచిలుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమం ఓ పండుగలా సాగింది. అయితే ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో అరుదైన, హత్తుకునే ఘటన జరిగింది. దెందులూరు బాల సదన్ విద్యార్థులకు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అమ్మ పాత్ర పోషించారు. బాలసదన్‌లో వారితో కలిసి భోంచేసిన కలెక్టర్.. అనంతరం వారిని బాల సదన్ నుంచి స్కూలుకు తన వాహనంలో తీసుకువచ్చారు. వారి చదువు గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.