Emotional Story: కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.. బిడ్డ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం!

1 year ago 40
Cow and Calf Reunion: తల్లి ప్రేమకు మనుషుల్లోనే కాదు, మూగజీవాల్లోనూ హద్దులు లేవని జగిత్యాల పట్టణంలో జరిగిన ఓ ఘటన నిరూపించింది. నరేందర్ అనే రైతు ఇంట్లో తల్లికి దూరమైన ఓ లేగదూడ ఆకలితో అల్లాడిపోయింది. సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని తల్లి ఆవు కోసం ఆ దూడ పడిన ఆవేదన చూసి చలించిన నరేందర్, ఆ దూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణమంతా వెతికాడు. కొత్త బస్టాండ్ వద్ద తల్లి ఆవు కనిపించగా, బిడ్డను చూడగానే అది ఆనందంతో, ఆకలితో అల్లాడిపోయిందన్న తపనతో ఆటో వెంటే పరుగులు తీసింది. వాహనాల రద్దీని కూడా లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి పరుగెత్తిన తల్లి ఆవు దృశ్యం చూసినవారిని కంటతడి పెట్టించింది.
Read Entire Article