ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అప్ డేట్ వచ్చింది. ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని.. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాయచోటిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తామని మంత్రి తెలిపారు.