ఏపీ నూతన సీఎస్‌గా జి. సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ప్రభుత్వ శాఖలలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన.. సీఎస్ విజయానంద్ పదవీకాలం పూర్తి కావటంతో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల కిందట గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సాయి ప్రసాద్ చేసిన ఓ పని.. ఇప్పుడు గుంటూరు జనం మదిలో మెదులుతోంది. సాధారణ తనిఖీలలో భాగంగా అరండల్ పేటలో పర్యటించిన ఆయన.. అక్కడ వీధులలో పుస్తకాలు అమ్మేవారి కష్టాలు చూసి.. వారి కోసం అప్పట్లో ఓ కాంప్లెక్స్ కట్టించారు.