తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని అన్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తుండగా.. రానున్న మరికొన్ని గంటల్లో మరిన్ని ప్రాంతాలకు వర్షం విస్తరిస్తుందని అన్నారు.