Gadwal Crocodile: అర్ధరాత్రి పూట.. రోడ్డుపై గుండెలదిరిపోయే దృశ్యం.. పిల్లనే కానీ..!

1 year ago 43
Crocodile Sighting: జోగులాంబ గద్వాల జిల్లాలోని హమాలీ కాలనీలో అర్ధరాత్రి వేళ స్థానికులు ఊహించని షాక్‌కు గురయ్యారు. కుక్కల అరుపులు విని బయటకొచ్చిన ఓ యువకుడికి రోడ్డుపై మొసలి కనిపించింది! భయంతో వణికిపోయిన కాలనీవాసులు, ఫారెస్ట్ అధికారుల సూచనలతో ధైర్యం చేసి, ఆ మొసలిపిల్లను తాడుతో బంధించారు. వేకువజామున అధికారులు వచ్చి దాన్ని తీసుకెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలోని జూరాల ప్రాజెక్టు కాలువ నుండి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పిల్లలు ఆడుకునే ప్రాంతంలో మొసలి రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు, ముళ్లపొదలు తొలగించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
Read Entire Article