విశాఖ రైల్వే స్టేషన్ త్వరలోనే కొత్త లుక్‌లోకి రానుంది. సిటీ స్థాయికి తగ్గట్టుగా ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్న 8 ప్లాట్‌ఫారాల సంఖ్యను 14కు పెంచేలా విస్తరణ పనులు రైల్వే శాఖ అధికారులు చేపడుతున్నారు. వీటికి తోడు అదనంగా ఆరు కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్ల రాకపోకల నియంత్రణలో వేగం, భద్రతను పెంచేందుకు అత్యాధునిక "ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్" వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఈ డెవలప్‌మెంట్ పనుల పురోగతిని విశాఖ ఎంపీ భరత్ పరిశీలించారు.