తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌.. ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్‌, 25 నుంచి సెకండియర్‌ పరీక్షలు

2 hours ago 2
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించనున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు.. ఫిబ్రవరి 25 నుంచి సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. థియరీ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. సెకండియర్‌ సైన్స్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు.. ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. జనవరి 27న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌.. జనవరి 29న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్షలు జరగనున్నాయి.
Read Entire Article