తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరిస్తూ.. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ పార్టీ తన పట్టును పెంచుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విస్తరణతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది.