దేశంలో రేపటి నుంచి నూతన జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ప్రకారం చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జీఎస్టీ విధానంపై తెలుగులో రూపొందించిన బుక్ లెట్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. రాష్ట్ర పన్నుల విధానంపైనా చర్చించారు. అలాగే కొత్త జీఎస్టీ విధానంతో ఏపీకి ఎంత మేరకు ప్రయోజనం అనే దానిపైనా చర్చించారు.