అమ్మ కోసం ఓ పదేళ్ల బాలుడి తపన కలెక్టర్‌ను కదిలించింది. గంటల్లోనే ఆ కుటుంబం కష్టాన్ని తొలిగించేలా చేసింది. ఈ ఘటన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ అనే నాలుగో తరగతి బాలుడు కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. తమ టఫిన్ బండిని అధికారులు తీసివేశారని.. దీంతో అమ్మ చనిపోదామంటోందంటూ ఆ చిన్నారి తన కుటుంబం కష్టం చెప్పుకొచ్చాడు. దీంతో స్పందించిన కలెక్టర్ టిఫిన్ బండి పెట్టుకోవడానికి వారికి స్థలం కేటాయించారు.