జీవీఎంసీలో మరో రెండు కొత్త జోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జోన్లను పదికి పెంచిన సంగతి తెలిసిందే. జనవరి ఒకటో తేదీ నుంచి నూతన జోనల్ కార్యాలయాల నుంచి కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఈ విషయంపై జోనల్ కమిషనర్లకు.. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి ఒకటి నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టేలా కార్యాలయం, సిబ్బంది, అధికారులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆదేశించారు.