Bathukamma 2024 : తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొమ్మిది రోజుల పాటు తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి పూల జాతర నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహిస్తారు. అయితే సద్దుల బతుకమ్మ (అక్టోబర్ 10)కు సెలవు ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి సెలవు విషయంలో ప్రభుత్వం నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.