మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌లోని ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ డెవలపర్స్ సంస్థ అక్రమంగా ఆక్రమించిందని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చెరువును దత్తత తీసుకున్న ఈ సంస్థ.. ఏకంగా దాని పేరును తమ ప్రాజెక్ట్ పేరుగా మార్చి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలోని ఈ చెరువులో 2 ఎకరాల బఫర్ జోన్‌ను కబ్జా చేసి 8 విల్లాలు నిర్మించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడికి చెందిన ఈ సంస్థపై ప్రస్తుతం హైడ్రా , ఇరిగేషన్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.