తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఈ క్రమంలోనే సీఎంఓలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భారీ మార్పులు చేపట్టింది. సీఎంఓలో కీలక పదవిలో ఉన్న అజిత్ రెడ్డికి.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్‌ను సీఎంఓలోకి తీసుకుంది.