హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌కు ఎలివేటెడ్ కారిడార్ రూపంలో గండం పొంచి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న కొత్త కారిడార్ పిల్లర్ల కోసం స్కైవాక్‌ను వరంగల్ జాతీయ రహదారి వైపు సుమారు 17 మీటర్ల మేర తాత్కాలికంగా తొలగించనున్నారు. మెట్రో రైలు లైన్‌ను దాటేలా ఈ ఫ్లైఓవర్‌ను గరిష్ఠంగా 75 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఈ తొలగింపు, పునర్నిర్మాణ పనుల అంచనా వ్యయం కోసం నేడు ఒక కన్సల్టెన్సీ సంస్థ అధ్యయనం చేయనుంది. ఈ ఖర్చును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భరించే అవకాశం ఉంది.