హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. సికింద్రాబాద్-మల్కాజిగిరి మార్గంలో నిర్మించే 6 కి.మీ పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ, GHMC మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కారిడార్ నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లు పిలిచి.. 2 నెలల్లో పనులు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాల ప్రజల ప్రయాణ సమయం, ట్రాఫిక్, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి.