హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రఖ్యాత డీఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ మరో నెల రోజుల్లో మూతపడనుంది. రాత్రివేళ ట్రాఫిక్ పెరగడంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 200కు పైగా స్టాళ్లతో ఉన్న ఈ ప్రాంతం యువత, ఐటీ ఉద్యోగులకు ఇష్టమైన ఫుడ్ హాట్‌స్పాట్‌గా మారింది. దుకాణాలను ఐటీసీ కోహేనూర్ రోడ్డుకు సమీప మైదానానికి తరలించేందుకు TGIIC ఏర్పాట్లు చేస్తోంది.