హైదరాబాద్ మణికొండలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన రోజే ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజగదిలో దేవుడికి పెట్టిన దీపం కారణంగా మంటలు చేలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 25 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.