కనిపెంచిన తల్లిదండ్రులను ఆస్తుల కోసం వదిలేసే అమానుష ఘటనలు సమాజంలో పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మలక్‌పేటలో ఇలాంటిదే జరిగింది. 90 ఏళ్ల శకుంతలా బాయిని ఆమె కుమారులు ఆస్తులు పంచుకొని ఇంటి నుంచి గెంటేశారు. ఈ దారుణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. శకుంతలా బాయి ఫిర్యాదు మేరకు ఆర్డీవో కౌన్సిలింగ్ ఇచ్చినా కుమారులు స్పందించలేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి, చివరికి ఆ ఇంటిని సీజ్ చేశారు.