సమాజంలో ఆడవారికే కాదు.. మగవారికీ రక్షణ లేకుండా పోతోంది. తాజాగా.. నగ్న ఫోటోలు పంపాలంటూ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని ఆగంతకుడు వేధింపులకు గురి చేశాడు. తాను చెప్పినట్లు వినాలని.. తనతో న్యూడ్‌గా మాట్లాడాలంటూ బాధితుడిని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో గత్యంతరం లేక సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.