HYD పాతబస్తీలో భారీ ఆపరేషన్.. 5 భవనాలు నేలమట్టం, రూ. 100 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

4 months ago 22
హైదరాబాద్ పాత బస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి శాస్త్రిపురం కాలనీలో క్రీడామైదానంలో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టింది. నిర్మాణదశలో ఉన్న ఐదు భవనాలు నేలమట్టం చేశారు. రూ. 100 కోట్ల ఆస్తిని హైడ్రా కాపాడింది. హైడ్రా ఆక్రమణల తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అక్కమార్కులు క్రీడామైదాన్ని కబ్జా చేస్తున్నారని.. 6500 గజాల స్థలాన్ని కబ్జా చేసి నోటరీలతో పలువురికి విక్రయించినట్లు గుర్తు చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్థలాన్ని కాపాడిన హైడ్రా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article