బట్టతల ఉండటం, పెళ్లి కావడం లేదనే బాధతో హైదరాబాద్‌లో ఒక యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పురోహిత్ కిషోర్ అనే యువ డాక్టర్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. బట్టతల ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.