Lovers Romance on Bike: హైదరాబాద్‌లో యువత వికృత చేష్టలకు అంతే లేకుండా పోయింది. పేరెంట్స్ ఇస్తున్న ఫ్రీడమ్‌ను యువత దుర్వినియోగం చేసుకుంటూ.. విచ్చలవిడితనంతో పేట్రేగిపోతున్నారు. ఇప్పటికే.. రీల్స్, షాట్స్ పిచ్చిలో యువత నానా రచ్చ చేస్తుంటే.. మరికొందరు సిగ్గువిడిచి.. నడిరోడ్లపైన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ చూసేవారికి జుగుప్స కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. పహాడీషరీఫ్ ప్రధాన రోడ్డుపై బైకు మీదే లవర్స్ రొమాన్స్‌తో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.