Hyd: మటన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. కిలో రూ.550 మాత్రమే.. భారీ క్యూ..

5 months ago 18
హైదరాబాద్‌లోని మటన్ ప్రియులకు అంబర్‌పేట్ గోల్నాక కబేలా భారీ ఊరటనిస్తోంది. బయట మార్కెట్‌లో కిలో మటన్ ధర రూ. 800 దాటగా.. ఇక్కడ కేవలం రూ. 550లకే లభిస్తుండటంతో జనం తెల్లవారుజాము నుండే క్యూ కడుతున్నారు. తలకాయ రూ. 400, బోటీ సెట్ రూ. 300లకే దొరుకుతుండటంతో ఒక్కొక్కరు రెండు మూడు కిలోల వరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు చికెన్ ధరలు సామాన్యులకు భారాన్ని పెంచుతున్నాయి. నగరంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 310కి చేరింది. చలికాలం ప్రభావం.. పెరిగిన డిమాండ్ వల్ల ఈ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరలో మటన్ లభించే మార్కెట్లకు మాంసం ప్రియులు పోటెత్తుతున్నారు.
Read Entire Article