హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మారుతండ్రి మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతడి ఆగడాలు శృతి మించటంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.