KBR Junction Flyover: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం నెలరోజుల్లో ప్రారంభం కానుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతితో, రూ.1090 కోట్లతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్‌జీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాయిల్ టెస్ట్ జరుపుతున్నారు. నిర్వాసితులకు టీడీఆర్ ఇచ్చేందుకు అంగీకరించారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సిగ్నల్ ఫ్రీ జంక్షన్ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు.