ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

2 hours ago 2
తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
Read Entire Article