హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ రాపిడో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంనగర్‌కు చెందిన మొహమ్మద్ జునైద్ తన వృత్తిని అడ్డం పెట్టుకుని, ఎవరికీ అనుమానం రాకుండా రోడ్ నంబర్ 12 పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 137 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక హోండా షైన్ బైక్, ఒప్పో మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని జునైద్‌ను రిమాండ్‌కు తరలించారు.