బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి ముదిరాజ్‌లు.. బీసీ కమిషన్‌ కీలక ప్రకటన

1 hour ago 1
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై సమగ్ర అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ బీసీ కమిషన్‌ తెలిపింది. ఈ మార్పు వల్ల బీసీ-ఏలోని 57 కులాలు, బీసీ-డీలోని 34 కులాలపై పడే ప్రభావాన్ని పరిశీలించనుంది. ఇందుకోసం సీపెక్‌ సర్వేలో సేకరించిన కులాల వివరాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. నగర, ఉప్పర కులాల విజ్ఞాపనలపైనా సమగ్ర సమాచారం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించిన నేపథ్యంలో కమిషన్‌ అధ్యయనం, తదుపరి నివేదికపై ఆసక్తి నెలకొంది.
Read Entire Article