లండన్‌లోని బివొటిబి వంటి అంతర్జాతీయ సంస్థలు మొదలుపెట్టిన తక్కువ ధర టికెట్, ఖరీదైన ఇల్లు గెలుచుకునే 'లక్కీ డ్రా' ధోరణి ఇప్పుడు తెలంగాణలోనూ ట్రెండ్ అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో రూ. 500 కూపన్‌తో ఇంటిని వేలం వేయగా.. ఒక చిన్నారి దాన్ని గెలుచుకుంది. నల్లగొండలో కూడా ఇలాంటి సంఘటనే నమోదైంది. రియల్ ఎస్టేట్ మాంద్యం ఉన్నప్పుడు భవిష్యత్తులో ఈ వేలం ట్రెండ్ మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.