స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భర్త కేకలు వేయగా.. కోపంతో ఊగిపోయిన భార్య అతడి తలపై ఐరన్ రాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావంటూ రాడ్డుతో తలపై బాదటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.