Hyderabad Bijapur Highway వాహనదారులకు తీపి కబురు.. అందుబాటులోకి నేషనల్ హైవే, ఇక దూసుకెళ్లిపోవచ్చు

1 hour ago 2
NH 163 Highway: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌హెచ్‌-163 పనులు వేగంగా సాగుతున్నాయి. రహదారిలో ఒకవైపు పనులు పూర్తైన ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే కార్లు, ద్విచక్రవాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. మీర్జాపూర్‌, పూడూరు పరిధిలో కొంత దూరం వాహనాలకు అందుబాటులోకి వచ్చింది. మరో రెండు నెలల్లో మొయినాబాద్‌, చేవెళ్ల మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర రాకపోకలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 46.405 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు రూ.785 కోట్ల వ్యయం అవుతోంది. ఇందులో రెండు బైపాస్‌లు, 12 అండర్‌పాస్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రహదారి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article