శ్వేతవిప్లవం 2.0లో భాగంగా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో తెలంగాణకు 1,525 కొత్త సహకార సంఘాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 4న మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్‌లో సబర్ డెయిరీ ప్రాజెక్టుకు భూమిపూజ, అమూల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఆధునిక డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు.