Hyderabad Metro Takeover: హైదరాబాద్ మెట్రోరైలు మొదటి దశలో తన పూర్తి వాటాను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించే ప్రక్రియను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఎల్ అండ్ టీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న రూ.1,461.47 కోట్లకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌తో ఒప్పందం కుదిరింది. తొలుత జూన్ 30, ఆ తర్వాత సెప్టెంబర్ 30గా నిర్ణయించిన గడువు తాజాగా మరోసారి పొడిగించారు. మెట్రో స్వాధీనానికి అవసరమైన రూ.13,600 కోట్ల రుణ సమీకరణ ప్రభుత్వానికి ప్రధాన సవాల్‌గా మారింది.