Ibrahimpatnam Fake Son: 24 ఏళ్ల తర్వాత కొడుకు దొరికాడంటూ వృద్ధుడికి టోకరా.. వెలుగులోకి నకిలీ సాధువు మోసం

1 hour ago 1
Fake Son in Sadhu: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ సాధువు మోసం వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు దొరికాడంటూ ఓ వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసేందుకు ప్రయత్నించారు. సీతారాంపేట్‌కు చెందిన లక్ష్మారెడ్డికి తన బంధువే సాధువు వేషంలో ఉన్న ఓ వ్యక్తిని కొడుకుగా పరిచయం చేశారు. ప్రస్తుతం అతడు మాలలో ఉన్నాడని.. మాల తొలగించేందుకు ఖర్చుల కోసంటూ రూ.10 వేలు తీసుకున్నారు. అనుమానంతో వృద్ధుడు నిలదీయగా.. తాను నకిలీ కొడుకునని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article