ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ స్టేషన్‌.. రూ.715 కోట్లతో ఆధునికీకరణ, ప్రారంభం ఎప్పుడంటే..?

1 hour ago 1
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను సుమారు రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. రెండు అంతస్తుల ఎయిర్‌ కాన్కోర్స్‌, మల్టీ లెవల్‌ పార్కింగ్‌, మెట్రో స్కైవాక్‌లు, కొత్త టెర్మినల్‌ భవనాలు, ఫుడ్‌ కోర్టులు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. 2026 ఆగస్టు నాటికి పనులు సుమారు 65 శాతం పూర్తయ్యాయి. గతంలో ఈ ఏడాది డిసెంబర్‌లోగా తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2027 జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది. పూర్తిస్థాయి ప్రారంభానికి సంబంధించి కచ్చితమైన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article