Hyderabad Property Fraud: ఒకే బిల్డింగ్ 54 మందికి అమ్మి రూ.4.5 కోట్లు వసూలు.. ఆస్తులు కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

1 hour ago 1
హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు భారీ ఆస్తి మోసాలు వెలుగులోకి వచ్చాయి. మాదన్నపేటలో ఒకే భవనాన్ని 54 మందికి విక్రయించి రూ.4.5 కోట్లు వసూలు చేసిన వ్యవహారం బయటపడింది. మరో కేసులో అధికారుల సంతకాలు, ప్రభుత్వ కార్యాలయాల సీళ్లను ఫోర్జరీ చేసి నకిలీ ఆస్తి పత్రాలు తయారు చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మౌలాలిలో ఖాళీ భూములను టార్గెట్‌ చేసి నకిలీ యజమానులను సృష్టించిన రౌడీషీటర్‌ ముఠా కూడా అరెస్టయింది. మూడు కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేయగా.. పలువురు నిందితులు పరారీలో ఉన్నారు. కాగా ఆస్తులు కొనేముందు అన్ని అంశాలను సరిచూసుకోవాలని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article