JNTUH VC Kiran Kumar Reddy: హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ టీ కిరణ్‌కుమార్‌రెడ్డిపై విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ సృజన కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల సదస్సుకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనతో పాటు హెచ్‌వోడీ డాక్టర్ డీ అరుణకుమారిని వీసీ దుర్భాషలాడుతూ.. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇంటికే పరిమితం కావాలని, పిల్లలను కనడం మాత్రమే మహిళల పని అన్నట్టుగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరం చెప్పడంతో గెట్‌ఔట్ అంటూ అరిచి, టేబుల్‌పై ఉన్న సుత్తితో దాడికి యత్నించారని ఆరోపించారు.