Rains In Telangana: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ వర్షాలు ఉంటాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.